హైద
రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి, కేంద్రానికి కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించేందుకు తమ అధిష్టానానికి, కేంద్రానికి ఈనెల 30 వరకు డెడ్‌లైన్ విధిస్తున్నామని ఆయన తెలిపారు. ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ భేటీ అయింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేసీఆర్ తిట్లను తాము ఆశీస్సులుగానే భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఐక్య ఉద్యమాలు చేస్తే 2011లోనే తెలంగాణ వస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణవాదులు పరస్పరం తిట్టుకోవద్దని ఆయన కోరారు. తెలంగాణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
Article source: http://www.teluguone.com/news/content/regional-24-6191.html

